ఆశకు పోతే దురాశ మిగిలింది

2 Apr, 2017 13:32 IST|Sakshi
ఆశకు పోతే దురాశ మిగిలింది
బ్రెజిల్‌: దురాశ దుఃఖానికి చేటు అనే మాట ఒక్కోసారి మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుందని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. కంటికి కనిపించిన ప్రతిదాన్ని స్వాహా అనిపించే కొండచిలువ ఒకటి ఆశకు పోయి చిక్కుల్లో పడింది. సహజంగా జంతువులను నుంచి మనుషుల వరకు దేనిని వదిలిపెట్టని అది కాస్త ఓ ముళ్లపంది విషయంలో కక్రుత్తి పడింది. దాని ఇంటి నిండా ముళ్లు ఉంటాయని తెలిసినా, అది విసిరితే బాకుల్లాంటి ముళ్లు దిగుతాయని తెలిసినా సాహసించి దాన్ని మింగే ప్రయత్నం చేసింది.

దీంతో ఒళ్లు మండిన ముళ్లపంది కాస్త ఒక్కసారిగా ఆ కొండచిలువపై ముళ్ల వర్షం కురిపించింది. దీంతో పదుల సంఖ్యలో ముళ్లు కొండ చిలువ నోటితో సహా ఒంటిపై కూడా బాణాల్లాగా దిగిపోయాయి. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఆ ముళ్ల బాధతో కదల్లేక ఎటు కదిలినా వస్తున్న నొప్పిన భరించలేక అటుఇటూ బొర్లుతున్న దాని వద్దకు ఓ కుక్క వచ్చింది. దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఓ పక్క నొప్పితోనే కుక్కను కూడా ఆ కొండచిలువ ఎదుర్కొంది. ఇలా ఒంటిపై ముళ్లులు, ఎదురుగా బెదిరిస్తున్న కుక్కను చూసిన ఆ కొండచిలువ పరిస్థితి చూసిన వాళ్లకు చాలా జాలేసింది. 
మరిన్ని వార్తలు