‘సోషల్‌’ అతిగా వాడితే అనర్థమే

11 Nov, 2018 04:46 IST|Sakshi

న్యూయార్క్‌: సామాజిక మాధ్యమాలను అతిగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి దరిచేరుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం ఆరోగ్యానికి హానికరంగా మారుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నపుడే మీరు మీ జీవితానికి కావాల్సిన ప్రశాంతమైన సమయాన్ని గడపుతారు’అని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా హంట్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు