వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి

2 Feb, 2020 10:52 IST|Sakshi

వుహాన్‌ :  కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి వుహాన్‌ నగరంలో చిక్కుకుంది. టీసీఎల్‌ ఉద్యోగి అయిన ఆమె మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడి అధికారులు కూడా శృతిని పంపేందుకు ఒప్పుకోవడం లేదు. ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 14న నంద్యాలలో జరగాల్సి ఉంది. శిక్షణ కోసం వూహాన్‌కు వెళ్లిన 58 మందిలో ఇద్దరు అక్కడే నిలిచిపోయారు. కరోనా ముందు ప్రేమైనా భారమే.. రోడ్లపైకి తోసేస్తున్నారు..!)

అయితే తనకు కరోనా వైరస్‌ లక్షణాలు లేవని, అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదంటూ తల్లికి పంపిన వీడియో క్లిప్‌లో శృతి తన బాధను వ్యక్తం చేసింది. ఈ వీడియో చూసిన శృతి తల్లి ప్రమీలా దేవి తన కూతురును ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమ కుమార్తెను వూహాన్‌ నుంచి రప్పించేందుకు చొరవ చూపించాలని  బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని శృతి తల్లిదండ్రులు కలవనున్నారు. నంద్యాలలో ఈ నెల 14న తమ కుమార్తె వివాహం జరగనుందని, ఆమెను వూహాస్‌ నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని విజ్ఞప్తి చేయనున్నారు.  (జీజీహెచ్లో కరోనా కలకలం)

ఇక ఇప్పటికే చైనాలో కరోనా వైరస్‌తో 400 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా చైనాలో ఉన్న 324 మంది భారతీయులను శనివారం ఉదయం విమానంలో దేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. వీరిలో 96 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీంతో మిగతావారిని చైనా నుంచి స్వదేశంకు తీసుకువచ్చేందుకు వెళ్లిన మరో విమానంలో శృతిని అధికారులు అనుమతించలేదు. అలాగే ఆదివారం ఉదయం రెండో విమానం ద్వారా 323మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు.స్వదేశానికి తిరిగివచ్చిన భారతీయులను రెండు వారాల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.  (వుహాన్ నుంచి భారత్కు..)

మరిన్ని వార్తలు