త్వరలో భారత్‌–యురేషియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

21 Jun, 2017 02:36 IST|Sakshi

► హైదరాబాద్‌లో భాగస్వామ్య సంప్రదింపుల భేటీ

హైదరాబాద్‌: భారత్‌–యురేషియా దేశాల మధ్య త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు విదేశీ వాణి జ్య విభాగం సంయుక్త కార్యదర్శి సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఒప్పందానికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాణిజ్య, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో భాగస్వామ్య సంప్రదిం పుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూరోపియన్‌ ఎకనమిక్‌ యూనియన్‌ ఐదు సభ్యదేశాలైన ఆర్మేనియా, బెలారస్, కజకి స్తాన్, కిరికిస్తాన్, రష్యాలతో ఎగుమతి, దిగు మతి అవకాశాలపై ఆయా దేశాల్లోని భారత వ్యాపారవేత్తలతో చర్చించారు.

ఫార్మా, ఆహా రోత్పత్తులు, ఐటీ, హోటల్స్, టూరిజం, హోటల్స్, రిసార్ట్స్‌ తదితర రంగాల్లో అవకా శాల వివరాలను సేకరించారు. ఈ భేటీ ఆధా రంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తామని అనంతరం సునీల్‌కుమార్‌ వెల్లడిం చారు. ఒప్పందం కుదిరితే భారత్‌– యురేషియా మధ్య వాణిజ్యం 8 బిలియన్‌ డాలర్ల నుంచి 37–62 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు