'జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేయలేదు'

23 Jan, 2020 10:35 IST|Sakshi

వాషింగ్టన్‌ : వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్‌ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు.  కాగా 2018లో సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నుంచి ఓ వాట్సాప్‌ మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్న అనంతరం జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని వాషింగ్టన్‌ పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వ్యక్తిగత వాట్సాప్‌ అకౌంట్‌ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్‌ చీఫ్‌ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని తమ కథనంలో పేర్కొంది. దీంతో పాటు 2018లో కాలమిస్ట్‌ జమల్‌ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయముందని సెంట్రల్‌ కూడా తమ కథనంలో రాసుకొచ్చింది.

(జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన సౌదీ రాజు)

>
మరిన్ని వార్తలు