కోవిడ్‌-19 : కొరియాలో కొనసాగిన పోలింగ్‌

15 Apr, 2020 18:51 IST|Sakshi

సియోల్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా దక్షిణ కొరియాలో పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ యథావిథిగా కొనపాగుతోంది. ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్‌ సిబ్బంది మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరం ఓటర్లను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తున్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రత్యేక బూత్‌ల్లో ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ఓటింగ్‌ వేళలు ముగిసిన తర్వాతా ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. కాగా ఈ ఎన్నికల్లో అధికార మూస్‌ జే ఇన్స్‌ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించాయి. కాగా, దక్షిణ కొరియాలో 10591 కరోనా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 225 మంది మరణించారు. 13 వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

చదవండి : కరోనా హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు

మరిన్ని వార్తలు