దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం

11 Mar, 2017 02:37 IST|Sakshi
దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం

అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం
సియోల్‌: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గెన్ హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్‌ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌కు అనుమతిచ్చింది.

పార్క్‌ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్‌ జస్టిస్‌ జంగ్‌–మీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కోర్టు ప్యానెల్‌ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని పార్క్‌ గెన్ హేను పదవి నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు. తన స్నేహితురాలైన చోయ్‌ సూన్  సిల్‌తో కుమ్మక్కై పార్క్‌ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు  పేర్కొంది.

మరిన్ని వార్తలు