-

అంతరిక్ష విమానం ముక్కచెక్కలు!

2 Nov, 2014 00:06 IST|Sakshi
అంతరిక్ష విమానం ముక్కచెక్కలు!

శుక్రవారం కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి వద్ద ‘స్పేస్‌షిప్‌టూ’ అంతరిక్ష పర్యాటక విమానాన్ని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ పరీక్షిస్తున్న దృశ్యమిది. తొలుత పెద్దగా ఉన్న ‘వైట్‌నైట్‌టూ’ విమానానికి అనుసంధానమై 13.7 కి.మీ. ఎత్తుకు చేరిన తర్వాత స్పేస్‌షిప్‌టూ విడిపోయింది. ఆ తర్వాత రాకెట్ ఇంజన్‌ను మండించి ధ్వనివేగానికి మూడున్నర రెట్లు.. గంటకు 4,184 కి.మీ. వేగంతో విమానాన్ని నడపడంతో కొన్ని సెకన్లకే ముక్కలుచెక్కలుగా పేలిపోయింది.

 

ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో పైలట్ పారాచూట్ సాయంతో కిందికి చేరుకున్నారు.
 

మరిన్ని వార్తలు