ప్రయోగించిన సెకన్లకే పేలిపోయిన నాసా రాకెట్

28 Jun, 2015 22:15 IST|Sakshi
ప్రయోగించిన సెకన్లకే పేలిపోయిన నాసా రాకెట్

మియామి: నాసా పర్యవేక్షణలో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ కొద్ది సేపటికే కుప్పకూలింది. భారీ శబ్దం చేస్తూ శకలాలన్ని చెల్లా చెదురుగా సుదూర ప్రాంతాల్లో పడిపోయాయి. పేలిన సందర్భంలో ఆకాశంలో భారీ స్థాయిలో వెలుతురు విగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సాధారణంగా సరుకు రవాణా చేసేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అనే సంస్థ నాసా సహాయంతో అవసరాలకు తగినట్లుగా రాకెట్ ప్రయోగాలు చేపడుతుంది. ఆ క్రమంలోనే ఆదివారం ఫ్లోరిడాలోని కేప్ క్యానవరాల్ నుంచి ఈ రాకెట్ను ప్రయోగించారు.

ప్రయోగించిన కొద్ది సేపటికే రాకెట్ పేలిపోగా దాని తాలుకూ చిత్రాలను నాసా సంస్థ స్పష్టంగా చిత్రీకరించింది. రాకెట్ పేలిపోయిన విషయాన్ని నాసా వివరాలు ఎప్పటికప్పుడు అందించే జార్జ్ డిల్లర్ స్పష్టం చేశారు. అసలు ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని సంబంధిత సంస్థ ప్రకటించింది. ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో తొలి వైఫల్యం ఇదే కావడం విశేషం. రాకెట్ ప్రయోగించిన రెండు నిమిషాల 19 సెకన్లకే కూలిపోవడం అందరినీ ఒకింత షాక్కు గురిచేసింది. 


ఫ్లోరిడాలోని అంతరీక్ష కేంద్రం నుంచి అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రానికి బయలుదేరిన ఈ మానవ రహిత ఫాల్కన్ 9 రాకెట్లో.. కొన్ని అత్యవసర వస్తువులు రవాణా చేస్తున్నారు. రాకెట్ పేలుడు దృశ్యాలను నాసా ఛానెల్లో అధికారులు ప్రసారం చేశారు.

మరిన్ని వార్తలు