లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా.. 

9 Jul, 2020 14:24 IST|Sakshi

కాంటాబ్రియా : క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఏ చోట చూసిన వ‌ర్క్ ఫ్రం హోం సాధార‌ణ‌మైపోయింది. వ‌ర్క్ ఫ్రం చేస్తూనే త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకునే వెసుల‌బాటుకు అవ‌కాశం ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం క‌దా.. వ‌ర్క్ ఫ్రం హోం ఎలాగైనా చేయొచ్చులే అనుకొని కొంద‌రు ష‌ర్ట్ ఒక్క‌టే వేసుకొని కింద షార్ట్ లేకపోతే లుంగీ క‌ట్టుకొని మీటింగ్స్‌కు అటెండ్ అవుతుంటారు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి డిస్ట‌ర్బ్ చేయ‌డం కూడా చాలా సార్లే చూశాం. అయితే కొన్ని సార్లు అదే వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల లైవ్ వీడియోల్లో అడ్డంగా దొరుకుతున్నారు. తాజాగా ఒక వ్య‌క్తి మాత్రం వ‌ర్క్ ఫ్రం హోం పేరుతో మరింత ముందుకు పోయాడు. ఏకంగా బాత్రూంలో స్నానం చేస్తూ లైవ్ వీడియోలో అడ్డంగా దొరికిపోయి ప‌ద‌విని కోల్పోయో ప్ర‌మాదంలో ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్పెయిన్‌లో చోటుచేసుకుంది.(రీల్స్​పై మోతమోగుతున్న మీమ్స్!)

వివ‌రాలు.. స్పెయిన్‌లోని  కాంటాబ్రియాలో  బెర్నాడో బుస్టిల్లా టోర్రెలావెగా కమ్యునికీ పార్ట్ టైమ్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాల‌న్ని వ‌ర్క్ ఫ్రం హోం ద్వారానే చూస్తున్నారు. కాగా బుస్టిల్లా కూడా ఆన్‌‌లైన్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్లో ప్రభుత్వ అధికారులు, జ‌ర్న‌లిస్టులు, ఇత‌రులు పాల్గొన్నారు. ఈ లైవ్ మీటింగ్ టీవీలో కూడా ప్రసారమ‌వుతున్న‌ది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన  మీటింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్న‌ది. అత‌ను బ‌య‌టికి వెళ్లి కూతుర్ని తీసుకురావాలి. టైం అవుతుంద‌ని స్నానం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ, మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారో వినాల‌ని లాప్‌టాప్‌ను కూడా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. వీడియో క‌నిపించ‌కుండా హైడ్ చేయ‌బోయి, మినిమైజ్ చేశాడు. ఇక అంతే.. అత‌ను స్నానం ఎలా చేస్తున్నాడో అంతా లైవ్‌లో క‌నిపించింది.(చావు నుంచి కాపాడుకోవ‌డానికే స్పీడుగా)

అత‌ని అవ‌తారం చూసి తోటి కౌన్సిల‌ర్లు, అధికారులు షాక్ అయ్యారు. మీటింగ్‌లో ఎంత అరిచినా ష‌వ‌ర్ వ‌ల్ల బెర్నాడోకి వినిపించ‌లేదు. మీటింగ్‌ను మ‌ధ్య‌లో ఆపేందుకు కుద‌ర‌దు. డిస్ట్ర‌బెన్స్ క‌లుగుతుంద‌ని అధికారులు తిట్ట‌డంతో అత‌ని ఫ్రెండ్స్ బెర్నాడోకి ఫోన్ చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఇక చేసేదేం లేక మీటింగ్‌ను వాయిదా వేశారు. బెర్నాడో ప్ర‌శాంతంగా స్నానం చేసిన త‌ర్వ‌త విష‌యం తెలిసి బాధ‌ప‌డ్డాడు. మీటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు స్నానం చేయాల్సి వ‌చ్చిందో స‌మాధానం చెప్పి, టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని క్ష‌మాప‌ణ‌‌లు తెలిపాడు. అయితే దీనికి బాధ్యత వహిస్తూ బుస్టిల్లాను రాజీనామా చేయాలని కంపెనీ కోరింది. ఇప్పుడు ఇదంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరిన్ని వార్తలు