కొదవలేని పొదరిల్లు

10 Oct, 2017 03:34 IST|Sakshi

‘మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది..’ పాత తెలుగు సినిమా పాటిది. ఫొటోలోని  ఇంటిని చూసుకుని అమెరికాలోని డెన్వర్‌ ప్రాం తంలోని ఓ జంట దాదాపు ఇలాంటి పాటే ఒకటి పాడుకుంటూ ఉంటుంది. అంత వెరైటీ ఈ  ఇల్లు మరి! కావాల్సిన విద్యుత్తు మొత్తాన్ని అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవడం, అన్ని రకాల చెత్తనూ రీసైకిల్‌ చేసేయడం, ఏసీతోపాట అన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులను తనంతట తానే నియంత్రించడం మాత్రమే ఈ ఇంటి స్పెషాలిటీస్‌ అనుకు నేరు. అన్నింటి కంటే ముఖ్యంగా.. ఇది ఇంటికి కావల్సిన నీటిని కూడా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తుంది. మాంచి పోషకా లతో కూడిన ఆహారాన్ని కూడా పండిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు అంత చిన్న ఇంటిలో ఎలా అనే సందేహం ఉంటే.. ఒక్కో దాని గురించి వివ రంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఇంటి పేరు ‘రియాక్ట్‌’. అంటే ‘రెసిలియంట్‌ అడాప్టివ్‌ క్లైమెట్‌ టెక్నాలజీ’ అని!

అమెరికాలో నిర్వహిస్తున్న సోలార్‌ డెక్లథాన్‌ పోటీల్లో భాగంగా దీన్ని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు కొం దరు నిర్మించారు. ఇంటి మధ్యలో వరండా లాంటి నిర్మాణం చుట్టూ అన్ని ప్రత్యేకతలూ ఒదిగిపోతాయి దీంట్లో. పైకప్పు పారదర్శ కమైన గాజుతో చేశారు. అవసరమైనప్పుడు దీన్ని పక్కకు జరుపుకోవచ్చు. దానివల్ల రోజంతా గాలి, వెలుతురుకు కొదవ ఉండదు. దీంతోపాటే సోలార్‌ప్యానెల్స్‌ కూడా ఉన్నాయి కాబట్టి కరెంటు కోసం బెంగ అవసరముండదు.  ఇక పైకప్పుపై పడే వర్షపు నీటితోపాటు ఇంట్లో వాడే నీటినీ రీసైకిల్‌ చేసి మళ్లీమళ్లీ వాడుకునేలా వ్యవస్థలు ఏర్పాటు చేశారు.  ఇక గోడల స్థానంలో ఉండే చట్రాల్లో బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఈ గోడలను కదిల్చే అవకాశం ఉండటం  వల్ల ఇల్లు ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరానికి తగ్గట్టు నిడివి పెరుగుతుంది, తగ్గుతుంది కూడా.     – సాక్షి  నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు