బిల్‌గేట్స్‌ - మనసున్న మారాజు

26 Mar, 2018 04:31 IST|Sakshi

ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఒకడు. అయినా కూడా ఏనాడు హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సాదాసీదా జీవితం అనుభవిస్తారు. తన అపార సంపదలో చాలాభాగం దానధర్మాలకే కేటాయించాడంటే ఆయన ఎంతటి హృదయశీలుడో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తిగా ఆయన ఎంతో పేరుప్రఖ్యాతులు సాధించారు. సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు జీవితాన్ని ధారపోసిన గొప్పవ్యక్తి. ఆయనే మైక్రోసాఫ్ట్‌ సంస్థను స్థాపించి, చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్‌. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...!

వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో.. ధనవంతుల కుటుంబంలో 1955, అక్టోబర్‌ 28న  బిల్‌గేట్స్‌ జన్మించారు. చిన్నప్పుడు గణితం, సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవారు. తన మిత్రుడు పాల్‌ అలెన్‌తో కలసి కంప్యూటర్‌ లాంగ్వేజీ బేసిక్‌  నేర్చుకొని అందులో ప్రోగ్రామ్‌లు రాయడం చిన్నప్పుడే  మొదలు పెట్టారు. 14 ఏళ్ల వయసునాటికే పాల్‌ అలెన్‌తో కలసి ట్రాఫిక్‌ లెక్కించే ప్రాసెసర్‌ ప్రోగ్రామ్‌లు రాసి, అమ్మడం  ప్రారంభించారు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా బిల్‌ గేట్స్‌ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.  

మైక్రోసాఫ్ట్‌ స్థాపన అభివృద్ధి..
1975లో ఎంఐటీఎస్‌ అనే మైక్రో కంప్యూటర్‌ సంస్థకు సాఫ్ట్‌వేర్‌ అందిస్తామని  బిల్‌గేట్స్, అతని స్నేహితుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరు ఏర్పాటు చేసుకున్న సంస్థకు మొదట మైక్రో–సాఫ్ట్‌ అని పేరు పెట్టి, ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్‌ అన్న పేరును నమోదు (రిజిస్టర్‌) చేయించారు. ఎంఐటీఎస్‌ సంస్థ వారు బిల్‌గేట్స్‌ అందిస్తున్న బేసిక్‌ కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా, ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్‌గేట్స్‌ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యారు.  1980 వరకు సంస్థ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకుంటూనే గేట్స్‌ ప్రోగ్రాములు రాసేవారు. ఐదేళ్లపాటు కంపెనీలో ప్రతివ్యక్తి రాసిన ప్రతి లైను పరిశీలించి, అవసరమయినచోట మార్పులు చేసేవారు.

1980లో ఐబీఎం సంస్థ  పర్సనల్‌ కంప్యూటర్‌లకు అవసరయ్యే బేసిక్‌ ఇంటర్‌ప్రీటర్‌కోసం బిల్‌గేట్స్‌తో చర్చించారు. అప్పుడు బిల్‌గేట్స్‌ తనకు తెలిన ఎస్సీపీ సంస్థ తయారు చేసే 86–డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లైసెన్సు తీసుకొని, ఐబీఎంకు అమ్మడం ప్రారంభించారు. అప్పటి నుంచి మైక్రోసాఫ్ట్‌ వెనుతిరిగి చూడలేదు. బిల్‌గేట్స్‌ దార్శనికత మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థగా మార్చింది. విండోస్‌ రూపకల్పనతో సాఫ్ట్‌వేర్‌ ప్రపంచాన్ని బిల్‌గేట్స్‌ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్‌ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్‌గేట్స్‌.. తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు. అనతి కాలంలో బిల్‌గేట్స్‌ మిలియనీర్‌ అయ్యారు. 

వ్యక్తిగతం  
బిల్‌గేట్స్‌ భార్య పేరు మెలిండా. వీరికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్‌లో 5.15 ఎకరాల విశాలమైన ఎస్టేట్‌లో దాదాపు 50,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో వీరి ఇల్లు ఉంది.  2005 లెక్కల ప్రకారం ఈ ఇంటి విలువ 135 మిలియన్‌ డాలర్లు. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. 1999లో బిల్‌గేట్స్‌ ఆస్తి విలువ 101 బిలియన్‌ డాలర్లు చేరుకొన్నపుడు అందరూ బిల్‌గేట్స్‌ను మొట్టమొదటి ‘‘సెంటి బిలియనీర్‌’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2007 లెక్కల ప్రకారం బిల్‌గేట్స్‌ ఆస్తి విలువ 58 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం 90 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండోస్థానంలో కొనసాగుతున్నారు.  

దానధర్మాలు 
2000 సంవత్సరంలో బిల్‌గేట్స్‌ తన భార్యతో కలసి బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ఎయిడ్స్‌ నిర్మూలన, మూడో ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య మొదలయిన సేవలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.  


బిల్‌ గేట్స్‌ ఇచ్చిన కొన్ని విరాళాలు... 
ప్రపంచ ఆరోగ్య సంస్థకు – 800 మిలియన్‌ డాలర్లు (ప్రతి ఏడాది) 
పసిపిల్లల వ్యాక్సిన్లకు – 750 మిలియన్‌ డాలర్లు,  
కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ – 210 మిలియన్‌ డాలర్లు.  
వాషింగ్టన్‌ డీసీలో పేదవిద్యార్థులకు – 122 మిలియన్‌ డాలర్లు.  
2004 ఫోర్బ్స్‌ పత్రిక లెక్కల ప్రకారం బిల్‌ గేట్స్‌ దాదాపు 29 బిలియన్‌ డాలర్ల విరాళాలు ఇచ్చారు. 

– సాక్షి స్టూడెంట్‌ ఎడిషన్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌