వహ్వారే.. వల్కిరే..!

3 Feb, 2019 03:18 IST|Sakshi

సినిమా చూసేందుకు థియేటర్లు.. ఇష్టమైన భోజనం ఆరగించేందుకు రెస్టారెంట్లు.. ఆర్ట్‌ గ్యాలరీలు.. ఈత కొలనులు అబ్బో.. షాపింగ్‌మాల్స్‌.. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.. ఇవన్నీ ఉన్నవి ఏ మల్లీకాంప్లెక్స్‌లోనో లేదా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోనో కాదు.. ఈ ఫొటోలోని బోటు.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బోటుగా చరిత్రలోకెక్కనుంది. దాదాపు రెండు ఫుట్‌బాల్‌ కోర్టుల వైశాల్యానికి సమానంగా ఉంటుంది. 229 మీటర్ల పొడవుండే ఈ బోటు ఒక కొన నుంచి మరో కొన వరకు దాదాపు 24 బస్సులను ఒకేసారి పార్కింగ్‌ చేయొచ్చు. వల్కిరే ప్రాజెక్టుగా పిలిచే ఈ బోటును రూపొందించేందుకు దాదాపు రూ.56 వేల కోట్లు ఖర్చు కానుంది. ఇందులో దాదాపు 52 మంది అతిథులు, 92 మంది సిబ్బంది ఉండొచ్చు. ఇది గంటకు దాదాపు 46 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దక్షిణ కొరియాకు చెందిన చుల్‌హన్‌ పార్క్‌కు ఇలాంటి బోటును తయారుచేయించుకోవాలని చిన్నప్పటి కల. ఇందుకోసం దాదాపు 8 నెలల పాటు బోటు డిజైనర్లతో మాట్లాడి.. ఆఖరికి పామర్‌ జాన్సన్‌ అనే డిజైనర్‌తో తనకు ఇష్టం వచ్చినట్లుగా డిజైన్‌ చేయించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద బోటు అరబ్‌ రాజు ఖలీఫా బిన్‌ జయెద్‌ అల్‌ నయన్‌ వద్ద ఉంది. ఇది 180 మీటర్ల పొడవు ఉంది. 

>
మరిన్ని వార్తలు