అందుకు ప్రతీకారంగానే శ్రీలంకలో బాంబుదాడులు!

23 Apr, 2019 14:54 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్‌ ఆదివారం నాడు భీకరమైన బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ.. శ్రీలంక సీనియర్‌ మంత్రి ఒకరు మంగళవారం దేశ పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు. 

న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్‌ విజేవర్దనే తెలిపారు. బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. 

శ్రీలంకలో గత ఆదివారం జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడుల్లో 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌