శ్రీలంకలో ‘కనిపిస్తే కాల్చివేత’

14 May, 2019 04:40 IST|Sakshi
ధ్వంసమైన మసీదు ప్రాంగణం

పలు పట్టణాల్లో మతఘర్షణలు

7 గంటలపాటు కర్ఫ్యూ

కొలంబో: దేశంలోని వాయవ్య ప్రావిన్స్‌సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు.  

‘ముస్లిం’ షాపులు ధ్వంసం
శ్రీలంకలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కులియపిటియా, బింగిరియా, దుమ్మలసురియా, హెట్టిపోలా పట్టణాల్లో మెజారిటీ సింహాళీయులు, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా ఫేస్‌బుక్, వాట్సాప్‌లపై మళ్లీ నిషేధం విధిస్తున్నామని సైన్యం తెలిపింది. ఈస్టర్‌ ఉగ్రదాడులకు సంబంధించి శ్రీలంక పోలీసులు ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా అనుమానితులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు