రాజపక్సను విచారిస్తాం

12 Jan, 2015 01:57 IST|Sakshi

 కొలంబో: ఓటమి అనంతరం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి సైనిక కుట్రకు వ్యూహం పన్నారనే ఆరోపణపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సపై ఆ దేశ కొత్తప్రభుత్వం విచారణ జరపాలని నిర్ణయించింది. రాజపక్స ప్రతిపాదనకు సైన్యాధినేతతో పాటు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ తిరస్కరించినందునే ఆయన వెనక్కి తగ్గారని తెలిపింది. అన్నిపార్టీలకూ ఆహ్వానం: సిరిసేన జాతీయ సమైక్యతకు కృషిచేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ తన ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని లంక కొత్త అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పిలుపునిచ్చారు. మైనారిటీలకు తగిన గుర్తింపునిస్తూ మతసామరస్యంకోసం పాటుపడతామని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలని   జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.  ఎన్నిక హామీ ప్రకారం కార్యనిర్వహక అధికారాలను పార్లమెంటుకు అప్పగిస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు