రావణుడే తొలి వైమానికుడు

1 Aug, 2019 11:34 IST|Sakshi

కొలంబో: చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడేనట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని.. రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశి దానతుంగే న్యూస్‌18తో ఫోన్‌లో మాట్లాడారు. ‘చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే. పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం’ అన్నారు.

కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా.. దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక అంతరిక్షంలోకి పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ దేశ ప్రజలు రావణుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా మృతి!

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లండన్‌

హృదయ కాలేయం@వరాహం

సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

బాంబు పేలుడు..34 మంది మృతి!

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..