మీ హక్కులపై పోరాడండి:ఇమ్రాన్ ఖాన్

24 Nov, 2014 10:12 IST|Sakshi

ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్,  పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాకిస్థాన్ లో పాలనే లేదని.. ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఎప్పుడో తిరస్కరించారని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు. పీటీఐ ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదీన జరప తలపెట్టిన భారీ ర్యాలీకి జన సమీకరణలో భాగంగా ప్రజల ముందుకొచ్చిన ఇమ్రాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

 

'పాకిస్థాన్ ప్రజలు వారి హక్కులపై నిలబడాలి.  ప్రజల హక్కులను విస్మరిస్తున్న ప్రభుత్వంపై ప్రజలు పోరాడాలి' అని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశానికి దిశా నిర్దేశం చేసేది మహిళలు, యువతేనని ఇమ్రాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పాకిస్తాన్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. తాను చేపట్టబోయే ర్యాలీని సక్సెస్ చేసి సరికొత్త కొత్త పాకిస్థాన్ కు నాంది పలకాలన్నాడు.

మరిన్ని వార్తలు