ఆ నియంత బొమ్మ రేటెంతో తెలుసా..?

9 May, 2016 18:41 IST|Sakshi

న్యూయార్క్: ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసిన నియంత బొమ్మకు న్యూయార్క్ లో జరిగిన వేలంపాటలో రికార్డు ధర పలికింది. మొకాళ్ల మీద కూర్చుని ఉన్న జర్మనీ నియంత హిట్లర్ బొమ్మను ప్రముఖ ఇటాలియన్ చిత్రకారుడు మారిజియో క్యాటెలాన్ తయారుచేశారు.

వ్యాక్స్, రెజిన్ మెటీరియళ్లతో తయారుచేసిన ఈ బొమ్మ గతంలో 7.9 మిలియన్ డాలర్ల ధర పలుకగా.. ఈ సారి 10 నుంచి 15 డాలర్లు పలుకుతుందని న్యూయార్క్ మ్యూజియం అధికారులు భావించారు. కానీ, వారి అంచనాలను మించి 17.5 మిలియన్ డాలర్ల (రూ. 114.59 కోట్ల)కు ఈ విగ్రహం అమ్ముడుపోయింది.. బౌండ్ ఫెయిల్ పేరుతో నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 39 మోడరన్ వర్క్స్ ను అమ్మకానికి ఉంచారు.

దీంతో పాటు వేలానికి ఉంచిన మరో బొమ్మ 'వన్ బాల్ టోటల్ ఈక్విలిబ్రియమ్ ట్యాంక్' 15.3 మిలియన్ డాలర్ల (రూ. 101.92 కోట్ల)కు అమ్ముడుపోయింది.. ఈ బొమ్మను జెఫ్ కూన్స్ తయారుచేశారు. ఆదివారం మొదలైన ఈ వేలంపాట గురువారం వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు విక్రయించిన బొమ్మలకు 78.1 మిలియన్ డాలర్ల (రూ. 520 కోట్ల)కు పైగా సొమ్ము వచ్చింది.

మరిన్ని వార్తలు