స్టీఫెన్‌ హాకింగ్స్‌ చెప్పిన జీవిత సత్యాలు..

17 Mar, 2018 16:27 IST|Sakshi
స్టీఫెన్‌ హాకింగ్స్‌

స్టీఫెన్‌ హాకింగ్స్‌ భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆయన తన మనుసుతో పలికిన ప్రతిభావం చిరస్మరణీయం. ఆయన పుస్తకం మనకు మార్గదర్శకం. హాకింగ్స్‌ తన జీవితంలో కేవలం సృష్టిని వివరించడమే కాదు మనిషి ఎలా ఉండాలి, మనసును ఎలా ఉంచుకోవాలి అన్న విషయాలను భావి తరాలకు అందించారు. ఆయన చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ప్రతి మనిషికి వర్తించడమే కాదు ఎలా ప్రవర్తించాలో చెబుతాయి. 
 

‘‘పని మీ జీవితానికో అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది..అది లేకుండా మీ జీవితం శూన్యం’’ 
ఇది 2010 సంవత్సరంలో ఏబీసీ వరల్డ్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట. ఈ వ్యాఖ్య గురించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్‌ సాలీ మైట్లిస్ వివరిస్తూ.. ‘‘ఈ వ్యాఖ్య ప్రతి జీవితానికీ వర్తిస్తుంది. పని కేవలం మన కడుపునింపే ఓ అవసరం మాత్రమే కాదు మన ఆత్మ సంతృప్తినిచ్చే చక్కటి ఔషధం కూడా. మనం చేసే పనిని ప్రేమిస్తే ఆ పని ఎంత కష్టమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అందులో నీకు నువ్వు చేయాల్సిన పని తప్ప కష్టం కనిపించదు. ఇది నీకు మాత్రమే కాదు నువ్వు పని చేసే సంస్థ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది.’’ అంటారామె. 
‘మీరు కెరీర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ జీవితంలో కచ్చితంగా సానుకూల ప్రభావాలను కలిగి ఉంటారు.’
ఈ విషయాన్ని చాలా మంది గొప్పవాళ్లు, తత్వ శాస్త్ర నిపుణులు అంగీకరించారు. మన జీవితంలో ఒక వృత్తిని ఎంచుకోవడం ద్వారా సగం విజయం సాధించినట్టేనని వారు తెలిపారు. అది మన జీవితంలో చోటుచేసుకోబోయే మంచి పరిణామాలకు మార్గమన్నారు.  

మరిన్ని వార్తలు