'స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదు'

12 Jun, 2016 20:20 IST|Sakshi

ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదని కేవలం దాని డిజైన్ మాత్రమే రూపొందించారని అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీలకు లీడర్ గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ అన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్), డిజిటల్ కెమెరాలను ఫెడరల్ రీసెర్చ్ రూపొందించిందని, వాటన్నింటిని ఆపిల్ గుదిగుచ్చి ఐఫోన్ ను తయారు చేసిందని డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్లాట్ ఫాంలో వ్యాఖ్యానించారు.

జీపీఎస్, ఫ్లాట్ స్క్రీన్, ఎల్ఎల్ డీ, డిజిటల్ కెమెరా, వైర్ లెస్ డేటా కంప్రషన్, వాయిస్ రికగ్నిషన్ తదితర టెక్నాలజీలను మొత్తం ఫెడరల్ రీసెర్చ్ నుంచే తీసుకున్నట్లు తెలిపారు. వీటన్నింటికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా, నేడు పెద్ద దిగ్గజాలుగా రాణిస్తున్న కంపెనీలు అన్నీ ఫెడరల్ రీసెర్చ్ నుంచి టెక్నాలజీని తీసుకున్నవేనని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు