మేఘం మింగేసేలా..

18 Jul, 2014 04:49 IST|Sakshi
మేఘం మింగేసేలా..

మనల్ని మింగేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మేఘం ఫొటో.. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్‌లా కనిపిస్తోంది కదూ.. ఎగిరే పళ్లెం(యూఎఫ్‌వో) తరహాలో కనిపిస్తున్న ఈ తుపాను మేఘం టోర్నడోలు, తుపానులు, అకస్మిక వరదలు వచ్చినప్పుడు ఏర్పడతాయి. ముఖ్యంగా బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికాలో ఇలాంటి తుపాను మేఘాలు కనిపిస్తాయి. జనాన్ని భయపెట్టేలా కనిపిస్తున్న ఈ మేఘాల ఫొటోలు తీయడంలో కాలిఫోర్నియాకు చెందిన జోడీ మిల్లర్ దిట్ట. ఈ చిత్రాన్ని ఆమె అమెరికాలోని రాస్‌వెల్ ప్రాంతంలో గత నెలలో తీశారు. తుపానులు వచ్చే సమయంలో ఫొటోల కోసం ఇలాంటి మేఘాల వెంట పడటమంటే.. లైఫ్ రిస్కే. కానీ.. అందులో ఉండే మజాయే వేరని మిల్లర్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు