ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందా?

15 Aug, 2015 14:44 IST|Sakshi
ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందా?

న్యూయార్క్ : ఒత్తిడికి గురిచేసే పనులు, వాటికి సంబంధించిన ఈవెంట్లలో పాల్గొనడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన రీసెర్చర్స్ పలు విషయాలను వెల్లడించారు. ఒత్తిడిలో ఉండే వారికి క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు ఎటువంటి బలమైన ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేల్చారు.

మానసిక కుంగుబాటు, ఒత్తిడి వల్లే క్యాన్సర్ సంభవిస్తుందని సాధారణంగా ప్రజలు భావిస్తారని రచయిత, మానసిక శాస్త్రవేత్త జేమీ గ్రేడస్ పేర్కొన్నారు. ఒత్తిడి, క్యాన్సర్ అంశాలకు సంబంధించిన నిపుణులు 70 ఏళ్ల నుంచి ఇటువంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు క్లినికల్ రీసెర్చర్స్ కూడా తమ అభిప్రాయాలను వీటితో కలిపి ఓ నిర్ణయానికి వచ్చారు. యూరోపియన్ పత్రికలలో ఈ విషయాలను వారు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు