మంత్రిని అపహరించి హతమార్చారు

26 Aug, 2016 15:57 IST|Sakshi
మంత్రిని అపహరించి హతమార్చారు

బొలీవియా: కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలేదని డిప్యూటీ మినిస్టర్ ను కిడ్నాప్ చేసి కిరాతకంగా  హతమార్చిన ఘటన బొలీవియాలో  చోటు చేసుకుంది. ప్రైవేటు కంపేనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని  డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులున్న ఆ దారి గుండా వెళుతున్న డిప్యూటీ మంత్రి రొడాల్ఫో ఇల్లాన్న్ ను చుట్టు ముట్టిన కార్మికులు ఆయనను అపహరించి, హతమార్చారని బొలీవియా ప్రభుత్వం తెలిపింది.

బొలీవియా ప్రభుత్వ మంత్రి కార్లోస్ రొమేరో ఇది కిరాతక చర్యగా అభివర్ణించారు. డిప్యూటీ మినిస్టర్ మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన  ఆందోళన కారులను హెచ్చరించారు. గత కొంత కాలంగా బొలీవియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గని కార్మికులు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులను  పోలీసులు హతమార్చారు.

మరిన్ని వార్తలు