ప్రవాస స్త్రీశక్తి అవార్డుకు ఉపసన

27 Sep, 2016 11:01 IST|Sakshi

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రవాసి మిత్ర మాస పత్రిక సంయుక్తంగా ప్రవాసి బతుకమ్మ అవార్డును ప్రకటించగా యూఏఈలోని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో సభ్యురాలైన ఉపసన రాబర్ట్ ఎంపికైనట్లు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఉపసన గత కొన్నేళ్ల క్రితం యూఏఈ దేశంలో స్థిరపడి దుబాయిలో ఉద్యోగం చెస్తు గల్ఫ్ సంక్షేమ సంఘంలో కీలకపాత్ర పోషిస్తూ సామాజిక సేవలో పాల్గొంటూ పలు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను స్త్రీశక్తి అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 2న హైదరాబాధ్‌లోని ప్రవాసి బతుకమ్మ సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో భాగంగా బేగంపేటలోని జీవనజ్యోతి క్యాంపు ఆఫీసులో డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగాఉపసనను గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాసరావు, రాజాశ్రీనివాస్, శ్రీనివాస్‌శర్మ, సదానంద్ తదితరులు అభినందించారు.

 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు