ఇక తలుచుకుంటే సాధించలేం!

21 May, 2016 10:22 IST|Sakshi

వాషింగ్టన్: మనం సాధారణం ఏ పనైనా చెయ్యగలం అని స్నేహితులతో గానీ, కుటుంబసభ్యులతో గానీ అని చెప్పెటప్పుడు వాడే పదం 'నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను' అని కానీ.. ఈ పదాన్ని అమెరికాలోని పిల్లలు ఇక ముందు చెప్పలేకపోవచ్చు! ఎందుకోతెలుసా.. అందుకు ముఖ్య కారణం 'ఇంటర్నెట్'. చెప్పలేనంత ఆత్రుత, ఎప్పుడెప్పుడు కంప్యూటర్ కు అతుక్కుపోదామనే కోరిక... ఇవి అమెరికాలో ప్రస్తుతం పిల్లల్ని మానసికంగా కుంగదీసి అంగవైకల్యాన్ని కలిగిస్తున్న సమస్యలు. మొబైల్స్, కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడకానికి బానిసైన కొంతమంది పిల్లలు తాజాగా సైక్రియాట్రిక్ సెంటర్ లకు వెళ్లి వారి సమస్యను వెలిబుచ్చడంతో ఈ భయంకర సత్యం బయటకు వచ్చింది.

పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లకుండా సమయాన్నంత ఇంటర్నెట్ పైనే వెచ్చించాలని అనిపిస్తుందని ఓ యువకుడు చెప్పిన మాటలు వింటుంటేనే తెలుస్తుందీ.. వారు నెట్ కు ఎలా బానిసలైపోయారో! తాజాగా వాషింగ్టన్ లో కామన్ సెన్స్ మీడియా 1,300 మంది తల్లిదండ్రులు వారి పిల్లలపై జరిపిన పరిశోధనల్లో 59 శాతం మంది పేరెంట్స్ తమ బిడ్డలు ఫోన్లకు బానిసలయినట్లు తెలిపారు. వీరిలో 50 శాతం పిల్లలు కూడా ఈ విషయాన్ని అంగీకరించడం విస్మయం కలిగించే అంశం. ఇంటర్నెట్ పిల్లల మెదళ్లలో ఎలా నాటుకుపోతోందో తెలుసుకోవడానికి అక్కడి వైద్యుల మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా ఎటువంటి పేరు నిర్ణయించని ఈ వ్యాధి ఇంకా ఎలాంటి విపరిణామాలకు దారీ తీస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

వేల మంది తల్లిదండ్రుల వందల నుంచి వేల డాలర్లను చేతపట్టుకుని తమ పిల్లలను టెక్నాలజీ చీకటి కోణం నుంచి కాపాడాలంటూ ట్రీటెమెంట్ సెంటర్(రీస్టార్ట్) చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. తమ తల్లిదండ్రులే టెక్నాలజీకి అలవాటు పడాలంటూ ఇంటర్ నెట్ వైపు ప్రోత్సహించారని ఇప్పుడేమో అది తమ జీవితాలను నాశనం చేస్తోందని రీస్టార్ట్ సెంటర్ కు వచ్చిన ఓ బాధితుడు తెలిపాడు. ఎక్కువ మంది ఇంటర్నెట్ లో ఆన్ లైన్ ఆటలు, పోర్న్ చూడటానికి బానిసలౌతున్నట్లు ఇప్పటివరకు పరిశోధకులు కనుగొన్నారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్ లు ఇప్పటికే ఇటువంటి సమస్యలపై క్యాంప్ లు నిర్వహించి అవగాహానా కార్యక్రమాలు చెపట్టగా.. అమెరికాలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఈ చేదు నిజాలపై పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని వార్తలు