ఆ లోహంతో కేన్సర్‌ కణాలు మటాష్‌

4 Nov, 2017 09:52 IST|Sakshi

ఇరిడియం అనే లోహం కేన్సర్‌ కణాలను కూడా మట్టుబెట్టగలదని శాస్త్రవేత్తలు తేల్చారు. చైనా, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలిగించకుండానే ఇరిడియం, ప్రత్యేక రకమైన ఆక్సిజన్‌లతో కూడిన పదార్థం లేజర్‌ కిరణాలకు ఉత్తేజితమై కేన్సర్‌ కణాలను చంపేస్తున్నట్లు తెలిసింది. పరిశోధన శాలలో కృత్తిమ ఊపిరితిత్తుల కేన్సర్‌ కణితిపై ఈ ప్రయెగం జరిగింది.

లేజర్‌ కిరణాలు పడ్డప్పుడు ఇరిడియంలోని ఆక్సిజన్‌ సింగల్‌టన్‌ ఆక్సిజన్‌గా మారిపోయిందని.. ఇది కేన్సర్‌ కణాలకు విషంలా పరిణమించిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త కూక్‌సన్‌ ఛూ తెలిపారు. అల్ట్రా హైరెజుల్యూషన్‌ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ ద్వారా తాము పరిశీలించగా చక్కెరలను జీర్ణం చేసుకునేందుకు, ఒత్తిడి నిర్వహణకు ఉపయోగపడే ప్రోటీన్లపై ఇరీడియం ప్రభావం చూపుతున్నట్టు తెలిసిందని వివరించారు.

మరిన్ని వార్తలు