టీవీని అతిగా చూస్తే.. అంతే!

21 Nov, 2018 11:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గంటలకొద్దీ టీవీ ముందు అతుక్కుపోతున్నారా? అయితే మీరు ఆ అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అవును రోజు రెండు గంటలకు పైగా టీవీ చూస్తే త్వరగా మరణం సంభవిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. గ్లాస్గో యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌ ప్రచురించింది. అతిగా టీవీ చూసే 40 నుంచి 69 ఏళ్ల వయసున్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. అలాగే ఏ వయసు వారు ఎక్కువగా నాలుగు గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నారో గుర్తించింది. 39 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతున్నారని, వీరు సుమారు రోజుకు 4 గంటలకు పైగా టీవీ చూస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఆరోగ్యవంతులు కేవలం రోజుకు 2 గంటల కన్నా తక్కువగా టీవీ చూస్తున్నారని తెలిపింది.

అలాగే 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు.. 9 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారిపై కూడా పరిశోధనలు జరిపింది. ఇలా 2గంటల 12 నిమిషాల కన్నా ఎక్కువగా టీవీ చూసేవారిలో తక్కువగా, ఎక్కువగా నిద్రపోయే వారి ప్రాణాలకు ముప్పున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. అలాగే టీవీ చూస్తూ సిగరెట్‌ తాగడం, మధ్యం సేవించడం వంటి పనులు చేసే వారికి గుండె జబ్బులు ఎక్కవగా వచ్చే అవకాశం ఉ‍న్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు