గుర్తుపట్టండి చూద్దాం!

14 Aug, 2019 11:45 IST|Sakshi
బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ఫొటో

లండన్‌: అర్థమైతే ఆర్టు.. అర్థం కాకపోతే మోడ్రన్‌ ఆర్టు అన్నాడు వెనకటికొకడు.. అయితే, ఇది ఆర్టు కాదు.. మోడ్రన్‌ ఆర్టు అంతకన్నా కాదు.. ఇది బీకాం ఫిజిక్స్‌ టైపు.. ఆర్ట్‌లో సైన్సన్నమాట. చూడ్డానికి ప్రముఖ చిత్రకారుడి బ్రష్‌ స్ట్రోక్స్‌లాగ ఉన్నాయి కానీ.. నిజానికిది ఎలుకలోని రక్త కణాలను చుట్టుముట్టి ఉన్న మృదువైన కండర కణజాలం. ‘రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ రీసెర్చ్‌’ పేరిట బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ఏటా ఈ సైన్స్‌ ఇమేజ్‌ పోటీలను నిర్వహిస్తోంది. ఎంఆర్‌ఐ స్కాన్స్, మైక్రో స్కోప్‌లు వంటి వైద్య ఉపకరణాలను ఉపయోగించి తీసిన చిత్రాలివి. ఈ పోటీలో ‘కణసాగరం’ పేరిట కేంబ్రిడ్జి వర్సిటీలోని పీహెచ్‌డీ విద్యార్థి లోనా కత్‌బర్ట్‌సన్‌ సమర్పించిన ఈ ఎంట్రీ ఓవరాల్‌ విన్నర్‌గా నిలిచింది.

అభివృద్ధి చెందుతున్న ఎలుక పిండంలో గుండె ఇమేజ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి డాక్టర్‌ రిచర్డ్‌ టైసర్‌ ఈ ఫొటో తీశారు. ఆరంభ దశలో గుండె కణాలు ఎరుపు రంగులో ఉన్నాయి. గుండె అర్ధచంద్రాకారంలో ఉంచి కొట్టుకోవడం మొదలుపెట్టింది.

>
మరిన్ని వార్తలు