ప్చ్‌... ‘సూడాన్‌’ అస్తమయం

20 Mar, 2018 17:02 IST|Sakshi
సూడాన్‌ తో భద్రతా సిబ్బంది (పాత చిత్రం)

జుబూ : ప్రపంచంలో చిట్టచివరగా మిగిలిన మగ తెల్ల ఖడ్గ మృగం ‘సూడాన్‌’ కన్నుమూసింది. 45 ఏళ్ల వయసున్న ఈ అరుదైన జీవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం సూడాన్‌ మృతి చెందినట్లు  ఓఎల్‌ పెజెటా పార్క్‌ నిర్వాహకులు ప్రకటించారు. 

వేటగాళ్ల బారి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేళ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. దీని పరిరక్షణ కోసం కెన్యా ప్రభుత్వం ఇప్పటిదాకా కోట్లలో ఖర్చు చేసి మరీ భద్రతను ఏర్పాటు చేయించింది. వీవీఐపీ వైట్‌రైనోగా ఇది బాగా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా గతేడాది డేటింగ్‌ యాప్‌లో విరాళాల సేకరణ చేపట్టిన సూడాన్‌ పేరు.. ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది.

ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి 3 మాత్రమే. అందులో సూడాన్‌ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి. వీటి సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకుండానే సూడాన్‌ కన్నుమూయటం విశేషం. 

>
మరిన్ని వార్తలు