సుడాన్‌ ప్రధానిపై ఉగ్రదాడి

9 Mar, 2020 23:11 IST|Sakshi

కైరో: సుడాన్‌ ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌కు త్రుటిలో ప్రాణా పాయం తప్పింది. సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో ఓ సమావేశంలో పాల్గొనేందుకు హమ్దోక్‌ వెళుతుండగా ఆయన వాహనశ్రేణిపై ఉగ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, నియంత పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అల్‌ బషర్‌ గతేడాది ప్రజాస్వామ్య తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడవగా,  ప్రధాని పీఠాన్ని హమ్దోక్‌ అధిరోహించాడు.

అయితే, ఇప్పటికీ పాలనను వెనకనుండి నడిపిస్తున్న మిలటరీ నాయకులు.. హమ్దోక్‌కు పూర్తి అధికారాలు అప్పగించేందుకు సుముఖంగా లేరు. అలాగే ఏడాది నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం 60 శాతానికి చేరగా, నిరుద్యోగిత 22.1శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో హమ్దోక్‌పై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

మరిన్ని వార్తలు