అఫ్ఘాన్ లో ఆత్మాహుతి దాడి..

23 Feb, 2016 07:55 IST|Sakshi
అఫ్ఘాన్ లో ఆత్మాహుతి దాడి..

కాబుల్: అఫ్ఘానిస్తాన్ బాంబు పేలుడుతో మరోసారి దద్దరిల్లింది. తాజాగా అఫ్ఘాన్ తూర్పు సరిహద్దులోని పర్వాన్ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మందికి పైగా మృతిచెందారని అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో వ్యక్తులు గాయపడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఏ ఉగ్రవాద వర్గం ఈ ఘాతుకానికి పాల్పడిందో తెలియరాలేదని.. ఏ సంస్థ ఇది తమ చర్యగా ప్రకటించలేదని వివరించారు.
 

>
మరిన్ని వార్తలు