సూపర్ కంప్యూటర్ షట్ డౌన్

13 Aug, 2015 12:14 IST|Sakshi
సూపర్ కంప్యూటర్ షట్ డౌన్

బీజింగ్ : ప్రపంచంలోనే అత్యంత వేగమంతంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ తియాన్హే-1ఏ ను షట్ డౌన్ చేశారు. ఉత్తర చైనా తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ కారణంతో సెకన్లో 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ పూర్తిచేసే సామర్థ్యం ఉన్న ఈ కంప్యూటర్ సేవలను తాత్కాలికంగా నిలిలివేశారు. ఈ కంప్యూటర్ తియాంజిన్ లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్లో ఉంది. బాంబు దాడి దాటికి ఈ భవనం పైకప్పు పాక్షికంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన తర్వాత కూడా సూపర్ కంప్యూటర్ పనిచేసిందని సెంటర్ డైరెక్టర్ లియూ గ్వాంగ్ మింగ్ చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా తియాన్హే-1ఏ ను తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్లు వివరించారు. టాప్ 500 కంప్యూటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తర చైనా తీర పట్టణం టాంజిన్ లో జరిగిన బాంబు పేలుడులో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు