కశ్మీర్‌ కంటే ధరల మంటపైనే కలత..

31 Oct, 2019 19:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం ఎదుట పాకిస్తాన్‌ గగ్గోలు పెడుతుంటే అక్కడి ప్రజలు మాత్రం కశ్మీర్‌ కంటే మండుతున్న ధరలు, ఆర్ధిక వ్యవస్థ దుస్థితిపైనే అధికంగా కలత చెందుతున్నారు. గాలప్‌-గిలానీ పాకిస్తాన్‌ సంస్థ దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 53 శాతం మంది పాకిస్తానీలు ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతుంటే, నిరుద్యోగం ప్రధాన సమస్యగా 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక అవినీతి పెద్ద సమస్యగా నాలుగు శాతం మంది పాకిస్తానీలు పేర్కొన్నారు. 1200 మంది పాక్‌ దేశీయులను ఈ సర్వే పలుకరించగా, కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్‌ పాకిస్తాన్‌కు ప్రధాన సమస్యగా చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తర్వాతే కశ్మీర్‌ పాకిస్తానీల ప్రధాన సమస్యగా మూడో స్ధానంలో నిలిచింది. అవినీతి, రాజకీయ అస్ధిరత, నీటి కొరత వంటి స్ధానిక సమస్యలను ప్రస్తావించకుండా కశ్మీర్‌పైనే తాము కలత చెందుతున్నామని ఎనిమిది శాతం మంది పాక్‌ ప్రజలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు