నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారం

16 Oct, 2014 09:53 IST|Sakshi
నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారం

న్యూఢిల్లీ : విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతపై మరో ముందడుగు పడింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరిన విషయం తెలిసిందే.  

స్వదేశంలో పన్నులు ఎగ్గొట్టి తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నట్లు అనుమానిస్తున్న భారతీయులపై స్విట్జర్లాండ్ దృష్టి సారించింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్ధం చేసే పనిలో పడినట్లు స్విస్ ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. 'స్విట్జర్లాండ్‌లోని వివిధ బ్యాంకుల్లో ఉన్న నిధులు ఎవరివో గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది.

 

ఇందులో భాగంగా భారతీయులు, భారతీయ సంస్థలపై దృష్టి సారించాం' అని స్విస్ ప్రభుత్వాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఆ జాబితాలోని వారంతా ట్రస్టులు, స్విస్ కంపెనీలు, ఇతర దేశాలకు చెందిన సంస్థల పేర్లతో ఇక్కడి బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు