ఆరోగ్య రంగంలో భారత్‌ అధ్వాన్నం

20 May, 2017 02:39 IST|Sakshi

తొలిస్థానంలో స్విట్జర్లాండ్‌  
పారిస్‌:
గత 25 ఏళ్లలో వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినప్పటికీ లక్ష్యాలను అందుకోవడంలో ఆసియాలోని భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రూనై దేశాలు విఫలమయ్యాయని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. వివిధ దేశాల్లో వైద్య సదుపాయాల లభ్యత, నాణ్యతపై 195 దేశాల్లో నిర్వహించిన సర్వేను లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించింది.

ఈ సర్వేలో 32 నివారించదగ్గ వ్యాధుల్ని అరికట్టడంతో పాటు 1990 నుంచి వైద్య సదుపాయాల మెరుగుదలపై ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో అమెరికా తొలిసారి 30వ స్థానానికి దిగజారినట్లు పరిశోధకులు ప్రకటించారు. తొలి 3 స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే నిలిచినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు