అతిచిన్న బంగారు నాణెం

24 Jan, 2020 05:12 IST|Sakshi

బెర్లిన్‌: స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని ముద్రించింది. దీనిపై చిత్రించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న బొమ్మ చూడాలంటే మాత్రం కళ్లద్దాలు ధరించాల్సిందే. వెడల్పు 2.96 మిల్లీమీటర్లు ఉండే ఈ నాణెం బరువు 0.0163 గ్రాములు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న నాణెం అని స్విస్‌మింట్‌ వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు  కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది.

మరిన్ని వార్తలు