‘కత్తి’లాంటి విజయం

19 Apr, 2016 09:12 IST|Sakshi
‘కత్తి’లాంటి విజయం

స్టావెంజర్: ఇప్పుడైతే యుద్ధమనగానే క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, లైట్ మెషిన్ గన్‌లు గుర్తుకొస్తాయి కాని... ప్రాచీన కాలంలో యుద్ధమంటే... కత్తి దుయ్యటమే కదా.. అప్పటి యుద్ధాల్లో కత్తిదే ప్రథమ ప్రాధాన్యం. రాచరిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా కత్తిని పౌరుషానికి, విజయానికి ప్రతీకగా భావించేవారు.

చిత్రంలో కనిపిస్తున్న 10 మీటర్ల ఎత్తున్న ఈ మూడు కాంస్య కత్తులు కూడా ఇలా ఏర్పాటు చేసినవే.. నార్వేలోని స్టావెంజర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ అంచున సుమారు 1100 సంవత్సరాల క్రితం వీటిని ఏర్పాటు చేశారు. అప్పటివరకు చిన్న చిన్న రాజ్యాల సమాహారంగా ఉన్న నార్వేని కింగ్ హెరాల్డ్ హఫ్రస్ఫ్‌జార్డ్ యుద్ధంతో మొత్తం తన పాలన కిందకు తీసుకొచ్చాడు. నార్వే చ రిత్రలోనే దీన్నొక కీలక పరిణామంగా భావిస్తారు. తన విజయానికి గుర్తుగా హెరాల్డ్ ఈ కాంస్య కత్తులను ఏర్పాటు చేశాడు.
 

>
మరిన్ని వార్తలు