అక్కడ సిరియా ఉగ్రవాది పాస్ పోర్ట్!

14 Nov, 2015 20:14 IST|Sakshi
అక్కడ సిరియా ఉగ్రవాది పాస్ పోర్ట్!

పారిస్/కైరో: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఫుట్బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది మృతదేహం వద్ద సిరియా దేశస్థుడి పాస్పోర్టు లభ్యమైంది. ఉగ్రదాడులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యుద్దానికి వచ్చినట్లయితే తగిన విధంగా స్పందించే వాళ్లమంటూ ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల టార్గెట్ జాబితాలో ఫ్రాన్స్ మిత్ర దేశాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ప్రమాదకరమైన బెల్టు బాంబులు, ఏకే 47 తుపాకులు, ఇతర పేలుడు సామాగ్రితో పకడ్బందీగా రాజధాని ఫ్రాన్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడులను యుద్ద చర్యలుగా పరిగణిస్తున్నట్లు దేశ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే పేర్కొనడంతో తన కార్యకలాపాలు కొనసాగిస్తామని తీవ్రవాద సంస్థ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లు, ఆత్మాహుతి బాంబు పేలుళ్ల ఘటనలో 127  మందిగా పైగా మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే.

మరిన్ని వార్తలు