కరోనా: తైపీస్‌ మసాజ్‌ పార్లర్‌ వెలవెల

5 Jun, 2020 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా వైరస్‌ కారణంగా మసాజ్‌లకు పేరొందిన తైపీస్‌ మసాజ్‌ పార్లర్‌ కస్టమర్లు లేక వెలవెలబోతుంది. ఈ పార్లర్‌ను తైవాన్‌ సరిహద్దులో నెలకొల్పారు. ఈ పార్లర్‌కు రోజు 600 మంది కస్టమర్లు వచ్చే వారని.. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు వస్తున్నారని పార్లర్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కస్టమర్లతో ఎంతో సందడిగా తమ పార్లర్‌ ఉండేదని.. ప్రస్తుతం పార్లర్‌ లాబీలో ఎవరు లేకపోవడంతో కాలక్షేపం చేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం పర్యాటక రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని.. తమకు కస్టమర్లు లేక తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మసాజ్‌ పార్లర్‌ డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ వాంగ్‌ జీ క్వాన్‌ పేర్కొన్నారు.  

ప్రస్తుతం ఉపాధి లభించే రంగానికి తమ ఉద్యోగులు ఎంచుకోవాలని జీ క్వాన్‌ సూచించారు. ఇటీవల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా తైవాన్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పర్యాటక రంగ నిపుణులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ద్వీపం, వైవిధ్యమైన ఆహార అలవాట్లు, ఆసియాలో ఉదారవాద ప్రజాస్వామ్యం తదితర అంశాలు తైవాన్‌ పర్యాటక రంగ అభివృద్ధికి కీలక అంశాలని తైవాన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తైపీస్‌ మసాజ్‌ పార్లర్‌ 24 గంటల పాటు సేవలందించడం విశేషం. జపాన్‌, దక్షిణ ‌కొరియా పర్యాటకులు ఎక్కువగా పార్లరు‌ను సందర్శిస్తుంటారు. అయితే గత 20ఏళ్లుగా తమకు ఈ రంగంలో అనుభవం ఉందని.. ఇప్పుడు వేరే రంగాన్ని ఎంపిక చేసుకొని ఉపాధి పొందడం అంత సులువు కాదని పార్లర్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ర‌జ‌నీకాంత్‌పై ట్వీట్‌,‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు