చైనా మీదికి క్షిపణి పేల్చిన తైవాన్

2 Jul, 2016 08:40 IST|Sakshi
చైనా మీదికి క్షిపణి పేల్చిన తైవాన్

తైవాన్: తైవాన్ దేశ వైమానిక దళం పెద్ద తప్పిదం చేసింది. పొరపాటున ఓ క్షిపణి విధ్వంసక అణుక్షిపణిని పొరపాటున చైనా మీదుగా పరీక్షించింది. అయితే, ఈ సమాచారం ఇంకా బీజింగ్కు చెరలేదంట. ఇప్పటికే చైనా తైవాన్ మధ్య అడపాదడపా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో తాజా విషయం దానికి మరింత ఊపిరిపోసేలా ఉంది. శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల స్వదేశీ సియుంగ్-ఫెండ్ 3(బ్రేవ్ విండ్) అనే విధ్వంసకర అణుక్షిపణిని తైవాన్ ఐలాండ్ గ్రూప్ పరీక్షించింది.

ఇది కాస్త చైనాలో భాగమైన పెంగూకు 75 కిలో మీటర్ల దూరంలోనే సముద్రంలో పడిపోయిందట. ఈ విషయం స్వయంగా తైవాన్ చెప్పింది. అసలు ఈ తప్పిదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు చెప్తున్నారు. సోయింగ్ నగర పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న నౌక ద్వారా పరీక్షించగా అది చైనా వైపు దూసుకెళ్లిందని అన్నారు. తామే స్వయంగా ఈ విషయాన్ని చైనాకు చెప్పుకొని వివరణ ఇచ్చుకుంటామని పరోక్షంగా చెప్పారు. 1949లోనే చైనా నుంచి తైవాన్ విడిపోయినప్పటికీ తైవాన్ తమ పరిధిలోని ప్రాంతమే అన్నట్లుగా అజమాయిషీ చెలాయిస్తుంటుంది. గత జనవరి నుంచి ఈ రెండు దేశాలకు అస్సలు పొగడం లేదు.

మరిన్ని వార్తలు