మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని విడాకులు..!

21 Jul, 2017 18:14 IST|Sakshi
మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని విడాకులు..!
తైవాన్‌: భర్త కట్నం కోసం వేదిస్తున్నాడనో.. తాగి వచ్చి కోడుతున్నాడనో.. వివాహేతర సంబంధం పెట్టుకుని తనను సరిగా చూసుకోవడం లేదనో.. విడాకులు కోరే భార్యలను మనం చూస్తుంటాము. వీటన్నింటికీ భిన్నంగా ఓ మహిన తాను పంపిన ఫోన్‌ మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని విడాకులు కోరింది. దీనికి కోర్టు స్పందించి విడాకులు మంజూరు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.  

తైవాన్‌కు చెందిన లిన్‌ అనే మహిళ  తన భర్త ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లిన్‌ గత ఆరు నెలల నుంచి లైన్‌ అనే యాప్‌ ద్వారా ఆయనకు మెసేజ్‌లు పంపింది. అయితే వాటిని చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరు గత కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం లేదు. ఇలా తన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడని లిన్‌ కోర్టులో ఆరోపించింది. లిన్‌ కోర్టులో మాట్లాడుతూ.. ఒకసారి తాను కారు ప్రమాదానికి గురైనపుడు ఆయనకు మెసేజ్‌ చేసినా చూసి కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరికీ సేవలు చేయాలని ఆర్డర్లు వేస్తాడని చెప్పింది. ఇదంతా విన్న న్యాయమూర్తి లిన్‌కు విడాకులు మంజూరు చేశారు.  
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు