సెల్ఫీ తీసుకోవాలా.. ఇవి పాటించండి..

22 Dec, 2015 14:07 IST|Sakshi
సెల్ఫీ తీసుకోవాలా.. ఇవి పాటించండి..

మాస్కో: ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోన్న ట్రెండ్ ‘సెల్ఫీ’. యువతలో అయితే దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేయడం.. తర్వాత వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూసే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందరిలా మామూలుగా సెల్ఫీలు తీసుకుంటే కిక్ ఏముంది అనుకొని కొందరు తమ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకర, వింత ప్రదేశాల్లో విభిన్న రీతిలో సెల్ఫీలు తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనేక మంది గాయపడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ సెల్ఫీ జాడ్యం వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. రష్యాలో సెల్ఫీల మోజులో పడి అక్కడి యువత ఎక్కువగా గాయాలు పాలవుతోంది. ఇలా సెల్ఫీ ప్రమాదాలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం సెల్ఫీలు తీసుకోవడంపై ప్రజలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది.

ఈ నేపథ్యంలో సేఫ్ సెల్ఫీల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి.

 

 

 

 

 

 

 

 

 

 

  • సెల్ఫీ తీసుకునే ప్రదేశం సురక్షితమైనదో కాదో చూడాలి. ఎత్తై ప్రదేశాలు, భవనాల అంచులకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించకూడదు.
  • జంతుప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం చేయొద్దు. ఆ సమయంలో జంతువులు దాడి చేసే అవకాశముంది.
  • రోడ్డు మధ్యలో, రైలు పట్టాల మధ్యలో నిలబడి వెనుక వాహనాలు, రైలు వస్తున్నప్పుడు సెల్ఫీ కోసం ప్రయత్నించొద్దు. ఇది ప్రమాదకరం.
  • కదులుతున్న వాహనాలపై నిలబడి కూడా సెల్ఫీ తీసుకోవద్దు. అలాగే విద్యుత్ వైర్లు తగిలే ప్రదేశాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.
  • ప్రమాదకర ఆయుధాలు చేతబట్టి వాటితో సరదాగా సెల్ఫీలు తీసుకోవడం కూడా ఎక్కువైంది. అయితే ఈ సమయంలో కొన్ని సార్లు పొరపాట్ల వల్ల గాయాలపాలవుతున్నారు. అందుకే ఇలాంటి సెల్ఫీలకు ప్రయత్నించకూడదు.
  • జలపాతాల దిగువన, నదుల మధ్యలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం.

మరిన్ని వార్తలు