కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌!

9 Aug, 2019 11:55 IST|Sakshi

కాబూల్‌ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయమై పాకిస్తాన్‌ పార్లమెంటులో ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీఫ్‌ తెచ్చిన పోలికపై తాలిబన్లు మండిపడ్డారు. కశ్మీర్‌ అంశంతో ఆఫ్గనిస్తాన్‌ను పోల్చడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. కశ్మీర్‌ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలపై షెబాజ్‌ మాట్లాడుతూ...‘ కాబూల్‌లో ఆఫ్గన్లు శాంతి సౌఖ్యాలతో హాయిగా జీవిస్తున్నారు. కానీ కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోంది. ఇది ఎంతమాత్రం ఆమోదించదగిన విషయం కాదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు స్పందనగా తాలిబన్‌ సంస్థ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్గనిస్తాన్‌ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేసినట్లు వార్తలు ప్రచురితం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బలగాల మోహరింపుతో అక్కడ ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, కశ్మీర్‌లో నివసించే ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. భారత​-పాకిస్తాన్‌ సంయమనం పాటించి హింస చెలరేగకుండా చూసుకోవాలి. కశ్మీరీల హక్కులకు భంగం కలగకుండా చూడాలి. 

యుద్ధం వల్ల కలిగే చేదు అనుభవాలను చవిచూశాం. కాబట్టి శాంతియుతంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నాం. ఇస్లామిక్‌ సహకార సంస్థ, ఇస్లామిక్‌ దేశాలు, ఐక్యరాజ్యసమితి సహా ఇతర ప్రధాన దేశాలన్నీ కశ్మీరీల అభద్రతా భావాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషించాలి. మీ ప్రభావంతో ఇరు దేశాలను ఒప్పించి సంక్షోభాన్ని అరికట్టాలి. ఇక కొంతమంది కశ్మీర్‌ అంశాన్ని ఆఫ్గనిస్తాన్‌తో పోల్చడం సరికాదు. అసలు అఫ్గనిస్తాన్‌ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? ఇతర దేశాల మధ్య పోటీకి వేదిక అయ్యేందుకు ఆఫ్గాన్‌ సిద్ధంగా లేదు. ఆఫ్గనిస్తాన్‌ను ఈ విషయంలోకి తీసుకురాకండి’ అని ముజాహిద్‌ లేఖలో పేర్కొన్నాడు. కాగా పార్లమెంటులో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై కాబూల్‌లో ఉన్న పాక్‌ రాయబారి వివరణ ఇచ్చారు. ‘ కశ్మీర్‌ కారణంగా అఫ్గానిస్తాన్‌లో హింస చెలరేగే అవకాశమే లేదు. ఈ సమస్య వల్ల దేశంలో శాంతికి ఎంతమాత్రం భంగం కలగబోదు. అయితే ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ‍ 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

ప్రార్థనలు.. ప్రశాంతం!

నిజం చెప్పే నాలుక

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ఉబెర్‌కు భారీ నష్టాలు

వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

ఈ పూవుతో కేన్సర్‌ మందు!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

ఆర్టికల్‌ 370 రద్దు; యూఎన్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికాలో కత్తిపోట్లు..

‘సంఝౌతా’ నిలిపివేత

కశ్మీర్‌పై స్పందించిన బ్రిటన్‌ ప్రధాని

ఈనాటి ముఖ్యాంశాలు

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

పాక్‌ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్‌

పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం

ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన మలాలా

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

పాక్ దూకుడుకు పెద్దన్న బ్రేక్‌

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

అడ్డంగా బుక్కై.. ఆత్మహత్య చేసుకున్నాడు!

అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు 

చైనా అసంతృప్తి.. భారత్‌ కౌంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌