డాలస్‌లో జోరుగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

21 Apr, 2016 12:46 IST|Sakshi
డాలస్‌లో జోరుగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను డాలస్‌లోని ఇర్వింగ్ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, కార్యక్రమ సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మిఆధ్వర్యంలో, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త పాలేటి లక్ష్మి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరిగాయి. డాక్టర్ కలవగుంట సుధ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంప్రదా నృత్యాలు, సినిమా పాటలతో కూడిన డాన్స్ మెడ్లీలు హుషారుగా సాగాయి. జానపద గీతాలు, జోష్‌తో కూడిన డాన్సులను కళాకారులు ప్రదర్శించారు. కామేశ్వర శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఆ తర్వాత స్థానిక బావర్చి రెస్టారెంట్ నుంచి వచ్చిన ఉగాది పచ్చడితో పాటు షడ్రుచులతో కూడిన భోజనంతో ఆహూతులను అలరించారు. పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణతో చేతులు జోడించి నమస్కరిస్తూ అందరినీ ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు సుమారు వెయ్యి మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. టాంటెక్స్ 30 వసంతాల పుట్టినరోజును కూడా ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం అన్నారు. టాంటెక్స్ శాశ్వత భవనానికి ఆమోదం లభించింది కనుక ఇక ఇప్పుడు తగినంత నిధులు సమకూర్చుకుని, అనువైన స్థలం ఎంపిక చేసి, ఆ తర్వాత భవననిర్మాణ పనులు మొదలుపెట్టాలన్నారు.

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2016 ఉగాది పురస్కారాలను ఈ సంవత్సరం సాహిత్యం, వైద్య, సామాజిక సేవా రంగాలలో సేవలందించిన వారికి ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో సత్యం మండపాటి, వైద్యరంగంలో డా. రాఘవేంద్ర ప్రసాద్, సంఘసేవ/సామాజిక సంక్షేమ రంగంలో పూర్ణ నెహ్రులకు ఈ పురస్కారాలను అందజేశారు. వారితోపాటు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, బొమ్మినేని సతీష్ లను బెస్ట్ వాలంటీర్ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథి కళాకారులైన ఇంద్రనీల్, మేఘన, పారిజాత, ప్రవీణ్ లను టాంటెక్స్ కార్యవర్గ బృందం జ్ఞాపికలతో, దుశ్శాలువతో సత్కరించారు.

మరిన్ని వార్తలు