వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న పాక్!

11 Feb, 2016 10:23 IST|Sakshi

ఇస్లామాబాద్: తమ దేశంలో ట్యూబర్క్లోసిస్ (టీబీ) వ్యాక్సిన్ కొరత చాలా ఉండటంతో పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. గత రెండు నెలల నుంచి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో టీబీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని పాక్ అధికారులు భావిస్తున్నారు. కొరత వల్ల చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చి వ్యాధుల నుంచి కాపాడుకోలేకపోతామని స్థానిక ఆరోగ్య సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సర్వీసు(ఎన్హెచ్ఎస్)కు బీసీజీ సిరంజీలు అవసరమని ఓ లేఖలో వెల్లడించింది.

అందుకు స్పందించిన ఎన్హెచ్ఎస్ కార్యదర్శి అయుబ్ షేక్ మాట్లాడుతూ... ఇటీవలే కొనుగోలు చేసిన సిరంజీలు, ఇతర మెడికల్ ఐటమ్స్ ను వారంలోగా పంపిస్తామని చెప్పారు. వాక్సిన్స్ అందుబాటులో లేకపోతే చిన్నారుల ఆరోగ్యం ఏమైతుందోనని పంజాబ్ ప్రాంతం అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల ఆరు లక్షల వ్యాక్సిన్స్ అందిస్తామని ఎన్హెచ్ఎస్ వెల్లడించింది. పంజాబ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని తమ లేఖలో జాతీయ ఆరోగ్యశాఖకు వివరించారు.  
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు