నివ్వెరపోయిన టెక్‌ దిగ్గజాలు

14 Mar, 2018 12:13 IST|Sakshi

భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మరణ వార్తతో ప్రపంచం యావత్తూ విషాదంలో మునిగిపోయింది.  ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ టెక్‌ దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులతోపాటు, పలువురు రాజకీయ నేతలు హాకింగ్‌ కన్నుమూతపై సంతాపాన్ని ప్రకటించారు.

వైజ్ఞానిక రంగానికి హాకింగ్‌ అందించిన  సేవలు అమూల్యమైనవని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ట్వీట్‌ చేశారు.  క్లిష్టమైన సిద్ధాంతాలను, భావనలను ప్రజలకు మరింత అందుబాటులో  తీసుకొచ్చిన ఆయన సేవలు ఎప్పటికీ  నిలిచిపోతాయన్నారు.  ఎన్ని అడ్డంకులున్నప్పటికీ, విశ్వంపై పూర్తి అవగాహన పొందేందుకు ఆయన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ సత్య నాదెళ్ల సంతాపాన్ని ప్రకటించారు. అద్భుతమైన శాస్త్రవేత్తను, మేధావిని ప్రపంచం కోల్పోయిందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ట్వీట్ చేశారు. నరాల వ్యాధి (అమ్యోట్రోఫిక్ లేటరల్‌ క్లిరోసిస్)తో బాధపడుతూ కన్నుమూసిన హాకింగ్‌ మోడరన్‌ కాస్మోలసీ రూపకర్తగా లక్షలాదిమంది ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. కాగా బ్లాక్‌ హోల్‌పై కీలక పరిశోధనలు చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్‌ హాకింగ్‌ ఆరోగ్య సమస్యలతో  ఐన్‌స్టీన్‌ పుట్టిన రోజునాడే  బుధవారం కన్నుమూశారు.  హ్యాకింగ్‌కు  రాబర్ట్, లూసీ, తిమోతి అనే ముగ్గురు  పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు