'అతడిలో ఏదో లోపం ఉంది'

23 Feb, 2016 11:16 IST|Sakshi
'అతడిలో ఏదో లోపం ఉంది'

లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడేక్కుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరోసారి తన రాజకీయ ప్రత్యర్థి, సెనేటర్ టెడ్ క్రూజ్, అతని మద్ధతుదారులపై విమర్శల పర్వం కొనసాగించారు. టెడ్ క్రూజ్ ను రోగి అని ట్రంప్ సంభోదించారు. అతనిలో ఏదో లోపం ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోవాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రూజ్ విజయం సాధించినప్పటి నుంచీ ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. వ్యక్తిగత విమర్శలకు కత్తిదూస్తున్నారు.

దక్షిణ కరోలినాలో గతవారం క్రూజ్ ను నిలకడలేని వ్యక్తి అని పేర్కొన్న విషయం తెలిసిందే. లాస్ వెగాస్ లో పాల్గొన్న ర్యాలీలో మాట్లాడుతూ... ప్రజలు చాలా తెలివైనవాళ్లు. వారు అబద్దాలు చేప్పేవాళ్లకు అసలు ఓట్లే వేయరు అని క్రూజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు క్రూజ్ తానేం తక్కవ తినలేదనిపించుకున్నారు. ట్రంప్ చేసే వివాదాస్పద అంశాలపై మండిపడ్డారు. గన్ కంట్రోల్, ముస్లిం వలసలపై నిషేధం లాంటి అంశాలను తన ర్యాలీలో భాగంగా ఎత్తిచూపుతు తన విజయావకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని వార్తలు