వీడు మాములోడు కాదు...

3 Apr, 2018 19:30 IST|Sakshi

విదేశాల్లో చదువుకోవాలనుకుంటే చాలా కష్టపడాలి. అక్కడి యూనివర్సిటీల్లో చేరాలంటే ఎన్నో ప్రవేశ పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలు ఫేస్‌ చేయాలి. అయితే పరీక్షల గోల మనకెందుకులే కొందరు వదిలేస్తారు. మరికొం‍తమంది పట్టుదలతో సాధిస్తారు. అయితే హూస్టన్‌కు చెందిన మైఖేల్‌ బ్రౌన్‌ మాత్రం అమెరికాలోని  దాదాపు  అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా అన్నింటికి అర్హత సాధించాడు.

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ మొదలుకొని యేల్‌, ప్రిన్‌స్టన్‌, టెక్సాస్‌ ఇలా ప్రఖ్యాత యూనివర్సిటీలన్నింటికి ఎంపికై అవి అందించే స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... నేను చాలా సంతోషంగా ఉన్నాను.  ఎవ్వరూ కూడా రిజెక్ట్‌ చేయలేరు ఈ యూనివర్సిటీల్లో చేరడానికి. మరీ ముఖ్యంగా స్టాన్‌ఫోర్డ్‌లాంటి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం వస్తే వదులుకోలేరు కదా  అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కొడుకు సాధించిన విజయానికి అతని తల్లి ఉప్పొంగుతూ...‘బ్రౌన్‌ చిన్నప్పటి నుంచీ చురుగ్గానే ఉండేవాడు. ఏ పని మొదలుపెట్టినా...మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు’ అంటూ తెలిపింది.

>
మరిన్ని వార్తలు