అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు

28 Dec, 2015 11:23 IST|Sakshi
అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు

హైదరాబాద్‌: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా షికాగోలోని ఎయిర్‌పోర్టులో సుమారు 20 మంది తెలుగు విద్యార్థులను సోమవారం అక్కడి అధికారులు నిలిపివేశారు. చదువుకోవడానికి అని వచ్చి తమదేశంలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్నారనే నేపంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సంబంధంలేని ప్రశ్నలు అడిగి విద్యార్థులను తిరిగి పంపేస్తున్నట్టు తెలుస్తోంది. మిషిగన్‌లోని ఓ వర్సిటీ విద్యార్థులను కూడా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కిపంపినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే రెండు వర్సిటీల విద్యార్థులు వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇమ్మిగ్రేషన్‌, ఎఫ్‌బీఐ అధికారుల తీరుతోనే విద్యార్థులకు ఈ సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వారు వాపోతున్నారు. ఏదో ఒక సాకుతో విద్యార్థులను యూఎస్‌ అధికారులు వెనక్కిపంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యూనివర్సిటీలు, ఎయిర్‌లైన్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలసి ఈ సమస్యను పరిష్కరించడానికి తానా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైనా స్క్రీనింగ్ ప్రాసెస్‌లో ఇబ్బందులు పడితే వాటిని info@tana.orgకు మెయిల్ చేయాలని తానా సూచించింది. అదేవిధంగా అమెరికాలో సురక్షితంగా ఉండడానికి అనుసరించాల్సిన నియమాలు http://www.tana.org/helplineteamsquare/safetyguidelines వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు